రమేష్ రాజా దర్శకత్వంలో శివబాలాజీ, శ్రద్ధాదాస్ జంటగా నటించిన చిత్రం "టార్గెట్". ఈ చిత్రాన్ని ఆర్.కె.గౌడ్ సమర్పించారు. ఈ సినిమాలోని ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారని చిత్ర సమర్పకుడు గౌడ్ వెల్లడించారు.
ఓ రచయిత్రి నవలలో జరిగిన సంఘటనలు నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుందన్నారు. సెక్సీతార ముమైత్‌ఖాన్ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించిందని సమర్పకుడు అన్నారు.
నిర్మాత దశరథ సంగిశెట్టి, బి. రామకృష్ణ మాట్లాడుతూ.. ఇందులోని ప్రతి పాత్రకు ఓ టార్గెట్ ఉంటుందని చెప్పారు. అదే ఈ చిత్రం ప్రధాన పాయింట్ అని, ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని, ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని దర్శకుడు తెలిపారు.