పూనెలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ఊహాచిత్రం". వంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి సత్య దర్శకునిగా పరిచయమవుతున్నారు. పైడిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో భాగంగా డీటీఎస్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. రచయితగా పరిశ్రమలోకి వచ్చిన తాను దర్శకుడిగా మారానని తెలిపారు. కథలో కొత్తదనాన్ని చొప్పించడంతోపాటు సినిమాటిక్‌గా మార్చామని, ఊహకందని ట్విస్ట్‌లతో ఊహాచిత్రముంటుందని ఆయన చెప్పారు. సాహిత్యపరంగా సంగీతపరంగా సినిమా హైలైట్ అవుతుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత పైడిబాబు మాట్లాడుతూ.. యూత్ సినిమా కాబట్టి వేసవి సెలవుల వరకు ఆగామని, రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించామని ఆయన వివరించారు. కథపై ఉన్న నమ్మకంతో కొత్తవారితో ఈ చిత్రాన్ని రూపుదిద్దామని వెల్లడించారు.
ఈ చిత్రానికి సంగీతం- శివ ఆర్. నందిగామ్, కెమెరా- వి.ఎన్. సురేష్ కుమార్
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.