1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. అధినేతను ట్రైలర్లో తిలకించండి

Adhinetha Trailer | అధినేతను ట్రైలర్లో తిలకించండి

వినోదం
జగపతిబాబు హీరోగా, సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం "అధినేత". కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ.. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, పటాయ, పుకెట్ ఐలాండ్స్‌లలో ఇంతవరకు ఎవరూ షూట్ చెయ్యని అద్భుతమైన లొకేషన్స్‌లలో ఈ సినిమాలోని రెండు పాటల్ని చిత్రీకరించామని తెలిపారు.

ఈ పాటలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ.. జగపతిబాబు కెరీర్‌లో మరో సూపర్‌డూపర్ హిట్ చిత్రంగా అధినేత నిలించిందన్నారు.

శ్రద్ధాదాస్, హంసనందిని, నీలిమ, ఆహుతిప్రసాద్, ఆనంద్‌రాజ్, డా. పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు, కృష్ణభగవాన్, చిత్రం శ్రీను, పృథ్వీ, ప్రసన్న, వేణు, ఆజాద్, ఉత్తేజ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..
About Writer
SELVI.M