1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. ముమైత్ "టార్గెట్" ట్రైలర్ మీ కోసం..

Mumaith Target Cinema Trailer | ముమైత్ "టార్గెట్" ట్రైలర్ మీ కోసం..

వినోదం
మైసమ్మ, పున్నమినాగు, మంగతాయారు టిఫిన్ సెంటర్, భజంత్రీలు వంటి సినిమాల తర్వాత ముమైత్ గ్లామర్‌తో సినిమా మొత్తాన్ని నడిపించాలనుకునే దర్శక, నిర్మాతల ఆలోచనలకు "టార్గెట్" సినిమా గండికొట్టింది. మరీ పాత కాలం నాటి కథను తీసుకోవడం, కథాగమనంలో ఆసక్తి లేకపోవడంతో ముమైత్ టార్గెట్ సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోతుందనే చెప్పాలి.

సాధారణంగా పాత కథలు ఎన్నుకున్నప్పుడు దర్శకులు కొత్త పద్దతిలో ఆ చిత్రాన్ని ప్రెజెంట్ చేయటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ టార్గెట్‌లో పాత పద్ధతే ప్రేక్షకులకు కన్పిస్తుంది. శ్రద్ధాదాస్, ముమైత్‌లు కాస్త ఎక్స్‌పోజింగ్‌కు పనికి వచ్చారనుకుంటే శివబాలాజీ పోలీస్ అధికారి పాత్రకు ఏమాత్రం సరిపోలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇకపోతే.. రమేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్.కె.గౌడ్ సమర్పించారు. ముమైత్ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M