1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" ట్రైలర్

Oka amayi O abhayi Cinema Trailer | "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" ట్రైలర్

వినోదం
"అశోకచక్రం" నిర్మాత అలెక్స్ తాజాగా "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాన్సీ ఆర్ట్స్ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి "తిందామా... పడుకున్నామా... తెల్లారిందా..." దర్శకుడు రామ్‌కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు హీరోగా విశ్వ పరిచయమవుతుండగా, రూపాకౌర్, లహరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

దర్శకుడు ఈ సినిమా గురించి చెబుతూ... ప్రేమ పవిత్రతను తెలియజెప్పే పాయింట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందన్నారు. "అవుటాఫ్ కాలింగ్ ఏరియా" అనే ట్యాగ్‌లైన్‌ కూడా ఈ సినిమాకు జతచేశామని చెప్పారు.

చిత్ర కథంతా ప్రేక్షకుడిలో ఉత్సుకతను రేకిత్తిస్తుందని దర్శకుడు తెలిపారు. ఇంటర్‌వెల్, క్లైమాక్స్‌లు ఊహకందని విధంగా ఉంటాయని, కథారీత్యా యు.ఎస్.‌కు చెందిన విశ్వ హీరోగా పరిచయం అవుతున్నాడని పేర్కొన్నారు. ఐ.టి. రంగంలో ఉంటూ అమెరికాలో మోడలింగ్ చేస్తున్న విశ్వ హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని చెప్పారు.

ఇంకా... సూర్య, ఉత్తేజ్, రాజేంద్ర, వినోద్ ప్రభాకర్, సుదర్శన్, మధు, దేవీశ్రీ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా... పైడాల శ్రీనివాస్, సంగీతం... గిరిశంకర్, మాటలు.. జి.వి. అమరేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... రామ్ కుమార్.
About Writer
SELVI.M