1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "ప్రయాణం" సినిమా ట్రైలర్‌ను చూసి రండి

Prayanam Cinema Trailer | "ప్రయాణం" సినిమా ట్రైలర్‌ను చూసి రండి

వినోదం
"ఐతే", "అనుకోకుండా ఒక రోజు", "ఒక్కడున్నాడు" చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా "ప్రయాణం". మంచు మనోజ్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుంది. హారికను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న ఈ చిత్రాన్ని ఏలేటి స్వయంగా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మలేషియా నుంచి సింగపూర్‌కు ప్రయాణం చేసే సమయంలో హీరోహీరోయిన్ల మధ్య జరిగే సంఘటనలే ఈ చిత్ర కథాంశమని ఆయన పేర్కొన్నారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని, లవ్‌స్టోరీని కొత్తదనంగా చూపే ప్రయత్నం చేశామని, ప్రధానంగా ఏడు పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుందని దర్శకుడు తెలిపారు.

ఎయిర్‌పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో, విమాన ప్రయాణం నేపథ్యంలో కథ నడుస్తుందని, అందుకే ఈ చిత్రానికి "ప్రయాణం" టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఏలేటి వెల్లడించారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M