1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Na Style veru| Cinema| Trailer| Rajasekhar| Bhoomika | "నా స్టైలే వేరు" సినిమా ట్రైలర్ మీ కోసం..

నా స్టైలే వేరు
డాక్టర్ రాజశేఖర్‌, భూమిక జంటగా దీపిక ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం "నా స్టైలే వేరు". జి.రామ ప్రసాద్‌ దర్శకత్వంలో మాగంటి గోపినాథ్‌ నిర్మిస్తున్న చిత్రం జూన్‌ మొదటివారంలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత మాగంటి గోపినాథ్‌ మాట్లాడుతూ... ఈ సినిమాలో హీరో రాజశేఖర్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారని, క్రిమినల్‌ లాయర్‌గా అద్భుతంగా నటించారని చెప్పారు.

రాజశేఖర్‌ జీవితంలోకి భూమిక ప్రవేశించగానే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్రంలోని ముఖ్యకథాంశమని నిర్మాత తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌ మిళతమైన ఈ సినిమా తప్పకుండా విజయవంతమువుతుందని ఆయన ఆశించారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M