1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Oyy| Cinema| Trailer| Sidharth| Shamili| Anjali | "ఓయ్" సినిమా ట్రైలర్ మీ కోసం

ఓయ్
'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అన్న సిద్దార్థ ఈసారి "ఓయ్" అంటూ తెరపైకి వస్తున్నాడు. యూనివర్శల్ మీడియా బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న "ఓయ్" సినిమాకు ఆనంద్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అంజలి ఫేమ్ షామిలి హీరోయిన్‌గా తెరంగ్రేటం చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

పొయటిక్ టచ్‌తో నడిచే కథనానికి సెంటిమెంట్ జతచేసి ఈ సినిమా రూపొందుతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుడు ఊహించని క్లైమాక్స్ ఉంటుందని దర్శక నిర్మాతలు అంటున్నారు.

ఇప్పటికే ఆడియో హిట్టైన "ఓయ్" సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M