1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

మల్లన్నను ట్రైలర్లో చూడండి

మల్లన్న
విక్రమ్ హీరోగా శ్రియ హీరోయిన్‌గా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం మల్లన్న. వి.క్రియేషన్స్ పతాకంపై కళైపులి ఎస్. థాను సమర్పణలో సుశీ గణేషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మల్లన్న చిత్రానికి సంబంధించిన ట్రెలర్స్ ఇటీవలే విడుదలయ్యాయి. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ దేశంలో పేదవారు మరీ పేదవారుగా, ధనవంతులు మరింత ధనవంతలుగా మారుతున్నారని దీనికి పరిష్కారం ఏమిటన్నది ఈ చిత్రంలో చూపినట్టు తెలిపారు.

ఈ చిత్రాన్ని నిర్మించిన నేపథ్యంలో తమిళనాడులో మాదిరిగానే తెలుగులో కూడా మల్లన్న ఫౌండేషన్ పేరుమీదుగా రెండు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ కనీస సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

హీరో విక్రమ్ మాట్లాడుతూ ఇది చక్కని సందేశంతో కూడిన చిత్రమన్నారు. ఈ చిత్రంలో తాను వివిధ గెటప్పుల్లో కనిపిస్తానని ఈ చిత్ర నిర్మాణానికి ఏడాదిన్నర కాలం పట్టిందని అన్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ చక్కని సంగీతాన్ని అందించారని, తాను సైతం ఈ చిత్రంలో పాటలు పాడానని తెలిపారు.
About Writer
SELVI.M