1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Mohan babu

Raju maharaju| Mohan babu| Ramya Krishnan| Sarvanad | రాజు-మహారాజును ట్రైలర్లో చూడండి

రాజు మహారాజు
మోహన్‌బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా, శర్వానంద్ హీరోగా నటిస్తోన్న చిత్రం "రాజు మహారాజు". ఈ సినిమా గురించి మోహన్‌బాబు మాట్లాడుతూ.. కుటుంబకథా చిత్రమిదని, కొత్త నిర్మాత అయినా చెప్పింది.. చెప్పినట్లు తీస్తున్నారని చెప్పారు.

రమ్యకృష్ణతో చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్నానని, ఇందులో శర్వానంద్ అన్నగా నటిస్తున్నానని మోహన్ బాబు తెలిపారు.

రమ్యకృష్ణ మాట్లాడుతూ.. మోహన్ బాబుది తనది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అని, చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్నామని వెల్లడించారు. సినిమా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకముందని చెప్పారు.

మోహన్ బాబు తమ బేనర్‌లో నటించడం వందరోజులు ఆడినంత ఆనందంగా ఉందని నిర్మాత కుమార స్వామి తెలిపారు. దీని ద్వారా తమ బేనర్‌కు మంచి వ్యాల్యూ వచ్చిందని ఆయన అన్నారు.

శర్వానంద్, రమ్యకృష్ణ అనుకున్న టైమ్‌కు షూటింగ్‌కు వచ్చారని, అంతా ఫ్యామిలీలా ఉన్నామని నిర్మాత తెలిపారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M