A okkadu| Cinema| Trailer| Ajay| Madhurima | ఆ ఒక్కడు ట్రైలర్‌ను తిలకించండి
ప్రతినాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్న అజయ్ 'ఆ ఒక్కడు' చిత్రం ద్వారా తొలిసారి కథానాయకుడిగా తెరపైకి రానున్నాడు. అమెరికాలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన 'టాలీ 2 హాలీ మూవీస్' సంస్థ తొలిసారి చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ అజయ్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించింది.
ఎన్.ఎస్.మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గణేష్ ఇందుకూరి నిర్మించారు. పదిమందిలో ఒక్కడిని గుర్తించేటప్పుడు 'ఆ ఒక్కడు' అంటుంటామనీ, అలాంటి ఆ ఒక్కడు ఏం చేశాడన్నదే తమ చిత్ర కథాంశమని దర్శకనిర్మాతలు తెలిపారు.
లవ్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ.. ఇలా అన్ని కమర్షియల్ అంశాలతో యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపొందిందనీ, గ్లామర్ బ్యూటీ మధురిమను ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామనీ అన్నారు.
ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ప్రత్యేక పాత్రతో నటించగా, ధర్మవరపు సుబ్రమణ్యం, సునీల్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.