1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Trailer

Mitrudu| Trailer| Bala krishna| Priyamani | "మిత్రుడు" ట్రైలర్‌ను వీక్షించండి

మిత్రుడు
బాలకృష్ణ, ప్రియమణి జంటగా నటించిన చిత్రం 'మిత్రుడు'. మహదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైష్ణవి సినిమా పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ సినిమా హిట్ అయిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

మిత్రుడు విజయవంతమైన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. 'మిత్రుడు అనే పేరే అందరినీ ఆకట్టుకుంటోందన్నారు. ఆహ్లాదకరమైన కుటుంబ కథా చిత్రమిదని, ప్రియమణి పాత్రకు కూడా చక్కటి ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు.

సరదాల్లో, సంబరాల్లో కాకుండా ఆపదల్లోనూ మనతో నిలబడి చేయూతనిచ్చేవాడే నిజమైన 'మిత్రుడు' అనే అంశంతో చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు వివరించారు. ఈ చిత్రంలోని సున్నితమైన హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M