1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Trailer

Na style Veru| Trailer| Rajasekar| Bhoomika | "నా స్టైలే వేరు" ట్రైలర్‌‌ను తిలకించండి

నా స్టైలే వేరు
డాక్టర్. రాజశేఖర్, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "నా స్టైలే వేరు". సెన్సార్‌‍‌ను పూర్తి చేసుకుందని చిత్ర నిర్మాత మాగంటి గోపీనాథ్ తెలిపారు. సెన్సార్ "యు" సర్టిఫికేట్ ఇచ్చిందని, ఈ నెల 12వ తేదీన సినిమాను విడుదల చేస్తామని నిర్మాత అన్నారు.

చిత్ర దర్శకుడు జి. రాంప్రసాద్ మాట్లాడుతూ.. రాజశేఖర్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథతో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పారు.

కుటుంబనేపథ్యంలో సాగే చక్కని ఎంటర్‌టైనర్ ఇదని, ఇంతవరకు ఆవేశపూరితమైన పాత్రల్లో చూసిన రాజశేఖర్‌ను ఈ చిత్రంలో కొన్నిచోట్ల శాంతమూర్తిగా చూస్తారని దర్శకుడు వెల్లడించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన లభించిందన్నారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M