1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Trailer

Vyapari| Trailer| S.J. Surya| Namitha| Tamanna| Malavika | "వ్యాపారి"ని ట్రైలర్లో తిలకించండి

వ్యాపారి
తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న "కొమరం పులి" చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య తమిళంలో హీరోగా నటించి హిట్ అయిన "వ్యాపారి" సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సూర్య సరసన సెక్సీతారలు తమన్నా, నమిత, మాళవిక కథానాయికలుగా నటిస్తున్నారు.

వరుసగా మాస్ చిత్రాలు తీస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న శక్తి చిదంబరం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రణతి క్రియేషన్స్‌ అధినేత కూనిరెడ్డి శ్రీనివాస్‌ "వ్యాపారి"కి నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం రికార్డింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. భారత తెరపై ఇప్పటివరకు రానటువంటి వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని చెప్పారు.

దర్శకుడు తెరకెక్కించిన విధానం, హీరోపాత్రను మలిచిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తుందని నిర్మాత వెల్లడించారు.

సీత, ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, వడివేలు, మాస్టర్‌ భరత్‌ తదితరలు నటిస్తోన్న "వ్యాపారి" చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M