1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. కత్రీనా "న్యూయార్క్" సినిమా ట్రైలర్‌ను తిలకించండి

BollyWood, Yash Raj Films, New York, John Abraham, Katrina Kaif | కత్రీనా "న్యూయార్క్" సినిమా ట్రైలర్‌ను తిలకించండి

కత్రీనా కైఫ్
ఆసియా అందగత్తె, అందాల రాశి కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా, జాన్ అబ్రహాం, నెయిల్ ముఖేష్, ఇర్ఫాన్ ఖాన్‌లు కీలక పాత్ర పోషించే బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం "న్యూయార్క్". ప్రముఖ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్‌ను బాలీవుడ్ అగ్రహీరో షారూఖ్ ఖాన్ విడుదల చేయగా, ఈ నెల 26వ తేదీన న్యూయార్క్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేస్తోంది.

ప్రస్తుత ట్రెండ్‌కు తగిన కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం స్నేహబంధానికి అద్దం పడుతుందని నిర్మాత అన్నారు. ముగ్గురు యువ స్నేహితుల మధ్య జరిగే పరిణామాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని మలిచామని ఆయన వెల్లడించారు.

త్వరలో తెరపైకి రానున్న చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M