1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. John Abraham

New York| John Abraham| Katrina Kaif| Neil Nitin Mukesh| Irrfan Khan | బాలీవుడ్ మూవీ "న్యూయార్క్" సినీ ట్రైలర్ మీకోసం...

బాలీవుడ్
బాలీవుడ్ అగ్రహీరో జాన్ అబ్రహం "న్యూయార్క్" సినిమా కోసం మహమ్మదీయుల పవిత్ర గ్రంథం ఖురాన్‌ను పఠిస్తున్నారట. "న్యూయార్క్" అనే చిత్రంలో ఎన్నారై ముస్లింగా కబీర్ ఖాన్ పాత్రను పోషిస్తున్న జాన్ అబ్రహం, తన పాత్రలో పూర్తిగా జీవించేందుకు ఖురాన్‌ను చదువుతున్నారని తెలిసింది.

కబీర్ ఖాన్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యే దిశగా ఖురాన్ పుస్తకాన్ని చదువుతున్నానని, ఆ రోల్ తనకు మంచి గుర్తింపు సంపాదించి పెడుతుందని అబ్రహం విలేకరులతో చెప్పారు. ఇప్పటికే ఫ్లూట్, సంస్కృతం నేర్చుకున్న అబ్రహం, ఆస్కార్ నామినేటడ్ "వాటర్" చిత్రం కోసం పంచకట్టుకు కూడా అలవాటు పడ్డారు.

ఈ నేపథ్యంలో తనకు లభించిన పాత్రలకు పూర్తి జీవం పోసే రీతిలో ఆ రోల్‌కు తగ్గట్లు తాను మారడం చేస్తున్నానని జాన్ అబ్రహం అన్నారు. ఖురాన్‌లోని పదాలను స్వచ్ఛంగా ఉచ్చరించేందుకు శిక్షణ పొందుతున్నానని ఆయన వెల్లడించారు.

జూన్ 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న "న్యూయార్క్" చిత్రంలో ఆసియా అందగత్తె కత్రీనా కైఫ్, నెయిల్ నితిన్ ముఖేష్, ఇర్ఫాన్ ఖాన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కనున్న "న్యూయార్క్" సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M