1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Trailer

Drohi| Trailer| Sarath Kumar| Jyothika| Andrea| Gautham Menon | "ద్రోహి" సినిమా ట్రైలర్‌ను తిలకించండి

ట్రైలర్
తమిళ హీరో శరత్ కుమార్, జ్యోతిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ద్రోహి. తమిళంలో "పచ్చైకిళి ముత్తుచ్చరం" పేరిట తెరకెక్కి హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో "ద్రోహి"గా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వైవాహిత జీవితం విలువలను తెలియజేసే కథాంశానికి మిస్టరీని జోడించి గౌతమ్ మీనన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఘర్షణ, రాఘవన్ వంటి యాక్షన్ చిత్రాల తరహాలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ద్రోహి రూపుదిద్దుకుంటోంది.

ఆండ్రియా, మిలిండి సోమన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తెలుగులోకి అనువాదమౌతోంది. హారిస్ జైరాజ్ సంగీతం సమకూర్చిన పాటలు శ్రోతలను తప్పకుండా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M