1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Tejam| Cinema| Trailer| Prety Jinganiya| Monisha | తేజం సినిమా ట్రైలర్ మీ కోసం..

తేజం
తొమ్మిదిమంది కొత్తవారిని పరిచయం చేస్తూ సన్‌రేస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'తేజం' అనే చిత్రాన్ని రూపొందిస్తోంది. రాజ్‌.కె.ఎస్‌. గోపి దర్శకత్వంలో ఎస్‌. రాజశేఖర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో మై3 ఆడియోద్వారా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది.

ఈ సినిమా గురించి దర్శకుడు గోపి మాట్లాడుతూ, తాను దాదాపు పన్నెండు సంవత్సరాలు వెంకటేష్‌ వద్ద పనిచేశాననీ, ఎన్నో కథలు రాసే అవకాశం కల్గిందని కొత్తవారితో రూపొందించిన తేజం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని తెలిపారు.

నిర్మాత రాజశేఖర్‌ మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రీతి జింగానియా ఓ ప్రత్యేకపాట చేసింది. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తయి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. పదిరోజుల్లో తొలికాపీ సిద్ధంకానుందన్నారు

ఇంకా ఈ చిత్రంలో సర్దార్‌ఫటేల్‌, సురేష్‌, మహేష్‌, వినోద్‌, వివేక, ఆర్‌.జె.రాజ్‌, గౌతమ్‌, జయవర్ధన్‌, మోనీషా కొత్తగా పరిచయం కాగా, మిగిలిన పాత్రల్లో ఎం.ఎస్‌. నారాయణ, బ్రహ్మానందం, సుభాషిణి, రమ్యచౌదరి, ఫణి, సూర్య తదితరులు నటిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా: ఎం. నాగేంద్రకుమార్‌, పాటలు: జొన్నవిత్తుల, శివ, శిరీష్‌, రాజేష్‌ఖన్నా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌.కె.ఎస్‌.గోపి.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M