1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Trailer

Snehithuda| Trailer| Nani| Madhavi Latha| Sathyam Bellamkonda | "స్నేహితుడా" ట్రైలర్‌ను తిలకించండి

స్నేహితుడా
నాని, మాధవీలత జంటగా జెమినీ ఫిలిమ్‌ సర్క్యూట్‌ సమర్పిస్తున్న చిత్రం 'స్నేహితుడా'. సత్యం బెల్లంకొండ దర్శకత్వంలో శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌. నిర్మాత రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవలే విడుదలైంది.

ఈ సినిమా గురించి దర్శకుడు సత్యం మాట్లాడుతూ, సున్నితమైన ప్రేమ కథతో కూడిన లవ్లీ ఎంటర్‌టైనర్‌ ఇదని తెలిపారు. శివ చక్కని బాణీలు ఇచ్చారని, మాటలు, పాటలు భాష శ్రీ రాశారని దర్శకుడు తెలియజేశారు.

సంగీత దర్శకుడు శివరాం శంకర్‌ మాట్లాడుతూ, ప్రియమైన నీకు, స్నేహమంటే ఇదేరా చిత్రాలకు బాణీలు సమకూర్చాను. చాలా కాలంగ్యాప్‌ తర్వాత మళ్ళీ తనకు 'స్నేహితుడా' చిత్రం ద్వారా అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని ఆశిస్తున్నట్లు తెలిపారు. కమ్మని సంగీతం ఇచ్చాను. ప్రసుత్తం రీరికార్డింగ్‌ జరుగుతోందని శివరాం చెప్పారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి.
About Writer
SELVI.M