1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

A okkadu| Cinema| Trailer| Ajay| Madhurima| Suresh Gopi | "ఆ ఒక్కడు" ట్రైలర్‌ను తిలకించండి

ఆ ఒక్కడు
విలన్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అజయ్, "ఆ ఒక్కడు" చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. టాలీ టు హాలీ పతాకంపై రూపుదిద్దుకున్న"ఆ ఒక్కడు". చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి లాయర్‌గా నటించారు. సుధాకర్ నిర్మించిన ఈ చిత్రానికి మూర్తి దర్శకత్వం వహించారు.

ఇప్పటికే విడుదలై ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. చిన్న థ్రిల్లర్ పాయింట్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలిపారు. హీరోయిన్‌గా మధురిమ అద్భుతంగా నటించిందన్నారు.

ఒక సంఘటన చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ చక్కని సంగీతాన్ని అందించారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో రచన మౌర్య ఐటం సాంగ్ చేసిందని, సునీల్ పాత్ర సీరియస్‌గా ఉంటూ కామెడీ పండిస్తుందని ఆయన వెల్లడించారు.
About Writer
SELVI.M