1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Allari Naresh

Akasa Ramanna| Allari Naresh| Sivaji| Rajiv Kanakala| Meera Jasmine| Gowri Pandit | "ఆకాశరామన్న"ను ట్రైలర్లో చూసి రండి

ఆకాశరామన్న
అల్లరినరేష్, శివాజీ, రాజీవ్ కనకాల హీరోలుగా, మీరాజాస్మిన్, గౌరిపండిట్ హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "ఆకాశరామన్న". ఫ్లాష్‌న్యూస్ ఫేం అశోక్ దర్శకత్వం వహిస్తుండగా, మన్యం సూర్యనారాయణ సమర్పణలో.. మన్యం రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా గురించి మన్యం రమేష్ మాట్లాడుతూ.. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ చిత్రంలో రావురమేష్, టార్జన్, రఘు, ఖయూం, వేణు, సన, గీతాసింద్, బండజ్యోతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా.. శ్రీరామ్, సంగీతం.. చక్రి, మాటలు.. చంద్రశేఖర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అశోక్.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M