గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "అద్భుతవైద్యం-ఆయుర్వేదం" ట్రైలర్ (Adbutha Vidayam-Ayurvedam| Trailer| LakshmayaChari| Srishant)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
ఆయుర్వేదం యొక్క విశిష్టతను తెలియజెప్పే ప్రయత్నంగా "అద్భుతవైద్యం-ఆయుర్వేదం" అనే చిత్రాన్ని తీస్తున్నట్లు దర్శకుడు ఎస్. రామచంద్రారావు తెలిపారు. ధన్వంతరి క్రియేషన్స్ పతాకంపై పార్వతమ్మ సమర్పణలో చిత్ర కథానాయకుడు కె.పి. లక్ష్మయ్యచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా గురించి లక్ష్మయ్యచారి మాట్లాడుతూ.. చిత్రాన్ని మొదట పెద్ద హీరోలతో చేయాలనుకున్నామని, కానీ టైటిల్ చూసి ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే హీరోగా నటిస్తున్నానన్నారు. పురాతనకాలం నుంచి ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద వైద్యం గురించి తొలిసారి సినిమాగా తెరకెక్కిస్తున్నామన్నారు. ధన్వంతరి మహర్షి ప్రతిపాదించిన ఆయుర్వేద వైద్యానికి తిరిగి పూర్వవైభవం తేవాలనే సదుద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు.

ఈ సినిమా ద్వారా అన్ని విధానాల వైద్యులకు ఆయుర్వేదం మాతృకని తెలిపినట్లు దర్శకుడు చెప్పారు. శ్రీశాంతి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్ చంద్రశేఖర్, కోట శంకర్‌రావు, రఘునాధరెడ్డి, కళ్ళు చిదంబరం, రావుల చంద్ర శేఖర్, కొండలరావు, అభినయశ్రీ, ప్రభావతి, కళావతి, సుమతి తదితరులు నటిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: అద్భుతవైద్యంఆయుర్వేదం, ట్రైలర్, లక్ష్మయ్యచారి, శ్రీశాంతి, పార్వతమ్మ