1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Current

Sushanth| Current| Trailer| Sneha Ullal| Ullasamga Utsahamga | సుశాంత్ "కరెంట్" ట్రైలర్‌ను వీక్షించండి

సుశాంత్
కాళిదాసు ఫేమ్ యువ కథానాయకుడు సుశాంత్‌, ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఫేమ్ స్నేహ ఉల్లాల్‌ జంటగా నటించిన చిత్రం ‘కరెంట్‌’. ఈ సినిమా విడుదలైన తొలి వారంలోనే రెండున్నర కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.

ఈ చిత్రాన్ని శ్రీనాగ్‌ కార్పోరేషన్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, శ్రీమతి ఎ.నాగసుశీలలు సంయుక్తంగా నిర్మించారు. థియేటర్‌లలో ప్రేక్షకుల రెస్పాన్స్‌ చాలా బాగుంది. చాలామంది అభినందిస్తూ ఫోన్లు చేస్తున్నారని నిర్మాతలు వెల్లడించారు.

వైవిధ్యమైన పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న అక్కినేని అభిమానులకు కరెంట్ చిత్ర నిర్మాతలు ధన్యవాదాలు తెలియజేశారు.

భారీ వసూళ్లతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న కరెంట్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M