1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Jayam Manade

Trailer| Jayam Manade| Vinay| Bhavana| vana| Ontari | "జయంమనది" సినిమా ట్రైలర్ మీ కోసం..

తెలుగు
తమిళంలో "జయంకొండాన్"గా తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో "జయంమనది"గా అనువదిస్తున్నారు. తమిళంలో పలు విజయవంతమైన భాషా, వసంతకోకిల, విజేత చిత్రాల మాతృకను నిర్మించిన టి.జి. త్యాగరాజన్, తాజాగా 'జయం మనది' చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.

సత్యజ్యోతి ఫిలింస్‌పై తెలుగులోకి అనువాదమౌతోన్న "జయం మనది" చిత్రంలో వాన ఫేమ్ వినయ్, ఒంటరి ఫేమ్ భావన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఆర్. కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్ర ఆడియో సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. కథాబలమున్న ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని సురేష్ ఆశించారు. టైటిల్‌కు తగినట్లుగానే ఈ చిత్రముంటుందని హీరో వినయ్ అన్నారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M