Ram Charan Teja| MagaDheera| Trailer| Chiranjeevi| Kajal Agarwal | "మగధీర"ను ట్రైలర్లో తిలకించండి
మెగాస్టార్ "చిరుత"నయుడు, పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ హీరోగా, "చందమామ" ఫేమ్ సెక్సీడాళ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన చిత్రం "మగధీర". షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
ఇకపోతే.. రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న "మగధీర" చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పునర్జన్మ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా అందరికీ మంచి గుర్తింపు సంపాదించి పెడుతుందని దర్శకుడు అన్నారు.
శ్రీహరి కీలక పాత్ర పోషిస్తున్న ఈ లవ్లీ ఎంటర్‌టైనర్ "మగధీర" సినిమా ఆడియోకు ఇప్పటికే శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని రాజమౌళి చెప్పారు. ఇదే తరహాలో చిత్రం కూడా విజయవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలో తెరపైకి వచ్చి అందరినీ అలరించనున్న "మగధీర" చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.