గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » సిద్ధార్థ, షామిలీల "ఓయ్" సినిమా ట్రైలర్ మీ కోసం.. (OYE| Cinema|Trailer| Siddharth| Shamili| Geethanjali)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
"నువ్వొస్తానంటే నేనొద్దంటానా" ఫేమ్ లవర్ బాయ్ సిద్ధార్థ హీరోగా, అంజలి పాప షామిలి హీరోయిన్‌గా నటించిన చిత్రం "ఓయ్". డి.వి.వి దానయ్య నిర్మాణ సారథ్యంలో, ఆనంద్ రంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. కానీ "గీతాంజలి"కి 'ఓయ్'కి పోలిక ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఓపెనింగ్స్, సిద్ధార్థ, షామిలీల నటనతో "ఓయ్" విజయవంతమైందని దర్శకుడు ఆనంద్ రంగ తెలిపారు. యూనివర్శల్ మీడియా పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో సిద్ధార్థ తండ్రిగా కోలీవుడ్ నటుడు నెపోలియన్ నటించారు.

ఈ చిత్రం చూస్తుంటే గీతాంజలి సినిమా గుర్తుకువస్తుంది. ఆ చిత్రమే లవ్‌స్టోరీపేరుతో వచ్చింది. దానికి కాస్త మెరుగులు దిద్ది "ఓయ్" అనే పేరుపెట్టినట్లుంది. ఇందులో హీరోహీరోయిన్ల పాత్రల పేర్లు కూడా సరిపోయేవిధంగా పెట్టారు. ఉదయించే సూర్యుడు హీరో, అస్తమించే అమ్మాయి సంధ్య. వీరిద్దరి మధ్య సాగే ప్రేమ ప్రయాణం ఎంతవరకు వచ్చింది? అనేది సినిమా.

ఇక కథలోకి వెళితే..
ఉదయ్ (సిద్ధార్థ) ఓ ఉన్నత వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తి. సంధ్య (షామిలి) సాధారణ యువతి. తను ఒంటరిగా సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఏకాంతమంటే ఆమెకు చాలా ఇష్టం. ఇద్దరి ఆలోచనలు వైవిధ్యమే. అలాంటి తరుణంలో సంధ్యను ఉదయ్ ప్రేమిస్తాడు. ఆమె పుట్టినరోజునాడు రకరకాల గిఫ్ట్‌లతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.

మరోవైపు ఆమె అలవాట్లుకూడా తన అలవాట్లుగా మలుచుకుంటాడు. అయినా ఆమె అతనికి దూరంగా ఉంటుంది. కానీ ఉదయ్ మరింత ప్రేమ పెంచుకుని ఆమెకు దగ్గరవుతాడు. తను "అస్తమిస్తున్న సంధ్య" అనే విషయం డైరీ ద్వారా ఉదయ్‌కు తెలుస్తుంది. ఆ తరుణంలో ఉదయ్ ఏం చేశాడు? సంధ్య చనిపోయిందా? లేదా? అనేది సినిమా.

జీవితంలో తొలిప్రేమను ఎప్పటికీ మరిచిపోరనే కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "ఓయ్" చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఓయ్, సినిమా, ట్రైలర్, సిద్ధార్థ, షామిలి, నెపోలియన్, గీతాంజలి