1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Vengamamba

Meena| Vengamamba| Annamacharya| Ananth | "వెంగమాంబ" సినిమా ట్రైలర్‌‌ను తిలకించండి

మీనా
ప్రముఖ నటి మీనా తరిగొండ "వెంగమాంబ"గా నటించిన చిత్రాన్ని నిర్మించడం పూర్వజన్మ సుకృతమని నిర్మాత వి. దొరస్వామిరాజు అన్నారు. ప్రారంభం నుంచి ఎలాంటి విఘ్నాలు లేకుండా చిత్రాన్ని పూర్తిచేశామన్నారు.

అన్నమాచార్యులు తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామిని కీర్తించిన కవయిత్రి తరిగొండ వెంగమాంబ. కొండపై ఆయన కొలువున్నంతవరకు ఈమె పేరు నిలిచిపోతుంది. 17వ శతాబ్దానికి చెందిన వెంగమాంబ 17 గ్రంథాలను రచించింది. అన్నమయ్య తర్వాత వెంగమాంబ చిత్రాన్ని తీయడం అదృష్టంగా భావిస్తున్నానని నిర్మాత వెల్లడించారు.

నటుడు అనంత్‌ మాట్లాడుతూ.. తాను ఈ చిత్రంలో వెంగమాంబను పెండ్లిచేసుకోవాలని ఆమెను ఏడిపించే పాత్రను చేశాను. తొలిసారిగా విలనిజం ఉన్న పాత్ర ఇదని చెప్పారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M