Magadheera | Latest trailer | Ramcharan Teja | Kajal Agarwal | | టాలీవుడ్‌లో "మగధీర" మానియా... చూడండి ట్రెయిలర్
మెగాస్టార్ తనయుడు, చిరుత హీరో రామ్‌చరణ్ తేజ కథానాయకుడిగా రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ చిత్రం "మగధీర" శుక్రవారం (31వ తేదీ) తెరపైకి రానుంది.
"చందమామ" ఫేమ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించారు. గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించారు.
పునర్జన్మ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఒకవైపు చరణ్ అద్భుత నటన, మరోవైపు కాజల్ అగర్వాల్ అందాలు, రాజమౌళి దర్శకత్వం, గ్రాఫిక్స్ వంటి పలు అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్లవుతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ముందుగా ఈ నెల 29వ తేదీనే "మగధీర"ను చిత్ర యూనిట్ విడుదల చేయాలని భావించింది. కానీ అనివార్యకారణాల చేత విడుదల తేదీని 31కి వాయిదా వేసింది. మగధీర చిత్రానికి సంబంధించిన ట్రయిలర్‌ను వీక్షించండి.