1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Trailer

Anjaneyulu| Trailer| Raviteja| Nayanatara| Bujji| Ganesh Babu | రవితేజ, నయనల "ఆంజనేయులు" ట్రైలర్ మీకోసం..

ఆంజనేయులు
క్రేజీస్టార్ రవితేజ, అందాలతార నయనతార జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం "ఆంజనేయులు". పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 12న) విడుదలై మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ... "రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ చిత్రంగా "ఆంజనేయులు" సంచలనం క్రియేట్ చేస్తోందని అన్నారు.

రవితేజ, నయనతార జోడీగా నటించిన ఈ భారీ చిత్రంలో ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండె, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, రాజా రవీంద్ర, ఎం.ఎస్ నారాయణ, సన, వినయ ప్రసాద్, మాస్టర్ భరత్, జీవా, 'సత్యం' రాజేష్ ముఖ్య పాత్రలు పోషించారు.

ఇంకా ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: కె. రవీద్రబాబు, సంగీతం: ఎస్. తమన్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఆర్ట్: చిన్నా, ప్రొడక్షన్ కంట్రోలర్: జి.జి.కె. రాజు, నిర్మాత: గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: పరశురామ్ (బుజ్జి).

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M