1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Adugu| Cinema| Trailer| Samarendra| Richa Soni | "అడుగు" సినిమా ట్రైలర్‌ను వీక్షించండి

అడుగు
సమరేంద్ర, రీచాసోనీ జంటగా నటించి తెరకెక్కిన చిత్రం "అడుగు". మాధవి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బొమ్మకంటి మాధవి ఈ చిత్రాన్ని నిర్మించగా, వీరప్రసాద్ నీలం దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. తాను దాసరి, శ్రీనువైట్ల దగ్గర పనిచేశానని, చక్కని సెంటిమెంట్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చెప్పారు. చక్కని నటనకు అవకాశమున్న పాత్రను పోషించడం సంతోషంగా ఉందని హీరో సమరేంద్ర అన్నారు. ఈ చిత్రం తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని హీరో ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చిత్ర సంగీత దర్శకుడు జీవన్‌థామస్ మాట్లాడుతూ.. యమగోల మళ్లీ మొదలైంది చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తాను అటుపై నాలుగు చిత్రాలకు పని చేశానని అన్నారు.

ఈ అడుగు చిత్రంలో మొత్తం ఆరుపాటలున్నాయని, ఈ సినిమాలో తొలిసారిగా విరహంతో కూడిన పాటకు బాణీలు సమకూర్చానని తెలిపారు. ఈ చిత్రంలోని ప్రతి పాటకు 10రోజుల సమయం పట్టిందని తెలిపారు.

ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోన్న "అడుగు" చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M