1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Trailer

Kalavaramaye Madilo| Trailer| Avakai Biryani| Kamal Kamaraju| Asta Chemma| Colours Swathi | "కలవరమాయే మదిలో" ట్రైలర్‌ను చూడండి.

కలవరమాయే మదిలో
"ఆవకాయ్ బిర్యాని" ఫేమ్ కమల్ కామరాజు హీరోగా, అష్టాచమ్మా ఫేమ్ కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటించిన చిత్రం "కలవరమాయే మదిలో". మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా గురించి దర్శకుడు సతీష్ కాసెట్టి మాట్లాడుతూ.. స్వాతి అనే అమ్మాయి కథే ఈ చిత్రమని, సింగర్ అవ్వాలనేది ఆమె కలని, కానీ మధ్యలో ఓ యువకుడు వచ్చి ఆమె మదిని కలవరపెడుతుంటాడని చెప్పారు. మొత్తానికి ఆమె కల నెరవేరిందా? లేదా? అనేదే చిత్రమని దర్శకుడు వివరించాడు.

విక్రమ్ గోఖలే, తనికెళ్ళ భరణి, జయసుధ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M