Anjaneyulu| Trailer| Raviteja| Nayanatara| Bujji| Ganesh Babu | "ఆంజనేయులు"ని ట్రైలర్లో వీక్షించండి
క్రేజీస్టార్ రవితేజ, సెక్సీతార నయనతార జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం "ఆంజనేయులు". పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ... "రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ చిత్రంగా "ఆంజనేయులు" సంచలనం క్రియేట్ చేస్తోందని అన్నారు.
రవితేజ చిత్రాలంటేనే ఎనర్జిటిక్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతూ వెటకారపు మాటల్తో ప్రేక్షకుల్ని మైమరిపిస్తాడు. అదే కోవలోనే ఆంజనేయులు ప్రయత్నించాడని సినీ పండితులు అంటున్నారు.
"కిక్" సినిమా తర్వాత వెంటనే అదే తరహాలో చేసిన "ఆంజనేయులు"లో రవితేజ నటన రొటీన్‌గానే ఉన్నా తల్లిదండ్రుల సెంటిమెంట్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బహుశా ఈ చిత్రంలోనే తొలిసారిగా రవితేజ ఏడ్చిన సన్నివేశాలున్నాయోమోనని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు.. ఇది పూర్తిగా హీరోబేస్డ్ సినిమా అని వారు చెబుతున్నారు.
రవితేజ, నయనతార జోడీగా నటించిన ఈ భారీ చిత్రంలో ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండె, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, రాజా రవీంద్ర, ఎం.ఎస్ నారాయణ, సన, వినయ ప్రసాద్, మాస్టర్ భరత్, జీవా, 'సత్యం' రాజేష్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.