1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Preminche Rojullo| Cinema| Trailer| Vijayanand| Keerthi| Vishwa Prasad | "ప్రేమించే రోజుల్లో" ట్రైలర్ మీకోసం..

ప్రేమించే రోజుల్లో
విజయానంద్, కీర్తి జంటగా విశ్వప్రసాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం "ప్రేమించే రోజుల్లో". శ్రీ వినాయక యాడ్స్ సమర్పణలో ఎస్.వి. క్రియేషన్స్ పతాకంపై కె. అరుణ్‌కుమార్, బి. సత్యన్నారాయణ, వి.బి. పూర్ణచంద్రరావు నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై శ్రోతలను అలరిస్తోంది.

మధుర స్మృతులతో కూడిన స్క్రిప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పారు.

ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నాని సంగీతం చక్కగా కుదిరిందని విశ్వప్రసాద్ తెలిపారు. దీంతో పాటు అల్ఫాబెటికల్స్‌తో వచ్చే ముద్దుపాట వైవిధ్యంగా ఉంటుందని నిర్మాతలు చెప్పారు.

ఇకపోతే.. ప్రతి మనిషి జీవితంలో మధురస్మృతులు ప్రేమించే రోజుల్లోనే ఉంటాయి. దీనిపై ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంటుంది. అలా ఓ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలను అందమైన దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని మలిచామని నిర్మాతలు అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, పృథ్వీ, కవిత, నర్సింహరాజు తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా రాజేష్ కాటా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విశ్వప్రసాద్.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M