గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » నారా రోహిత్ "బాణం" ట్రైలర్ మీ కోసం... (Banam Cinema| Trailer| Nara Rohith| Vedika| Aswanidat| Chandra Babu Naidu)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
సినీ ప్రముఖుల వారసుల్ని హీరోలుగా పరిచయం చేసి ఘనత సాధించుకున్న మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, నారా రామ్మూర్తినాయుడు తనయుడు, నారా రోహిత్‌ను హీరోగా వెండితెరపై పరిచయం చేయనున్నారు.

వైజయంతి నుండి త్రీ ఏంజిల్స్ స్టూడియోస్ పతాకంపై ప్రియాంకదత్ చలసాని, చైతన్య దంతులూరి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం "బాణం" పేరిట తెరకెక్కనుంది.

ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణోత్సవాన్ని ఐదు న్యూస్ ఛానల్స్‌లో వినూత్నంగా జరిపారు. అయిదు ఛానల్స్‌లో అయిదుగురు ప్రముఖులు ఈ ఆడియో సీడీలను రిలీజ్‌చేసి ఒక్కోపాటను విడుదల చేయడం విశేషం.

నారా రోహిత్, వేదిక జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో రణధీర్‌రెడ్డి, షాయాజీ షిండే, భానుచందర్, ఎ.వి.ఎస్. తదితరులు నటించారు.

వైజయంతి బేనర్‌లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ త్రీ ఏంజిల్స్ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న తొలిచిత్రం "బాణం"కు అద్భుతమైన సంగీతం సమకూర్చారు.

వైజయంతి హౌస్ నుంచి వస్తోన్న "బాణం" చిత్రానికి నిర్మాత: శేషు ప్రియాంక చలసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చైతన్య దంతులూరి.

ఇకపోతే.. సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న "బాణం" చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: బాణం, సినిమా, ట్రైలర్, నారా రోహిత్, వేదిక, అశ్వనీదత్, చంద్రబాబు నాయుడు