గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » నాగచైతన్య "జోష్" ట్రైలర్‌ను తిలకించండి (Josh, Trailer, Naga Chaitanya, Nagarjuna, Dil Raju, Karthika, Anushka, Sneha Ullal)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న "జోష్" చిత్రం అనేక ప్రత్యేకతలతో తెరకెక్కనుంది. చైతన్యకి జోడీగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతోంది.

అలాగే "అరుంధతి" చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న అనుష్క, స్నేహ ఉల్లాల్‌లు ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్స్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్. అంతేగాకుండా.. మిస్ ఫెమీన్ రన్నరప్ శ్రియ కూడా హీరోయిన్ కార్తీక స్నేహితురాలిగా కనిపిస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే.. ఆర్య, బొమ్మరిల్లు, భద్ర చిత్రాలకు స్క్రిప్టు వర్క్ చేసిన వాసువర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేగాక నాగార్జున నటించిన "నిన్నే పెళ్ళాడతా.." వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సందీప్ చౌతా "జోష్"కి సంగీతం అందిస్తున్నాడు.

ఇక జోష్‌లో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ దర్శకుడు, నటుడు జె.డి చక్రవర్తి నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నాడు. వీటి అన్నింటికి తోడు వరుస విజయాలతో తన హవాను కొనసాగిస్తున్న దిల్ రాజు నిర్మాత కావటం. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన "జోష్" ఆగస్టు 29 (నాగార్జున పుట్టినరోజు)న విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో మీ కోసం..
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: జోష్, ట్రైలర్, నాగచైతన్య, నాగార్జున, దిల్ రాజు, కార్తీక, అనుష్క, స్నేహా ఉల్లాల్