1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Sankham| Cinema| Trailer| GopiChand| Trisha| Sathyaraj | గోపీచంద్, త్రిషల "శంఖం" ట్రైలర్ మీ కోసం...

శంఖం
గోపీచంద్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం 'శంఖం'. ఇందులో తమిళ నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్రను పోషించారు. ఇప్పటికే ఈ సినిమాకు చెందిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయని దర్శకుడు శివ అన్నారు.

జె.భగవాన్, జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉందని దర్శకుడు వెల్లడించారు. 'శౌర్యం తర్వాత గోపీచంద్ తో కలిసి చేస్తున్న చిత్రమిదని, మాస్, యాక్షన్ అంశాలతో పాటు కుటుంబ బంధాలతో ముడిపడ్డ కథతో శంఖం చిత్రం రూపుదిద్దుకుంటోందని దర్శకుడు తెలియజేశారు.

కథానాయకుడు ప్రత్యర్థులపై ఏ సందర్భంలో 'శంఖం' పూరించాడన్నది తెర మీదే చూడాల్సిందేనని నిర్మాతలు అన్నారు. ఇందులో గోపీ, త్రిషల పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయని వారు తెలిపారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M