1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Ram Gopal Varma

Phoonk 2 Cinema Trailer| Ram Gopal Varma| Horror Movie| Adavi | వర్మ హారర్ మూవీ "ఫూంక్ 2" ట్రైలర్‌ను తిలకించండి

ఫూంక్2
"అడవి" తర్వాత తనదైన స్టైల్‌లో యథావిధిగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "ఫూంక్ 2" పేరిట తెరకెక్కనున్న ఈ సినిమా.. రామ్ గోపాల్ వర్మ హిందీలో తీసిన 'ఫూంక్' (తెలుగులో 'రక్ష') చిత్రానికి సీక్వెల్.

ఈ సినిమాను ఓ రియాలిటీ హారర్ చిత్రంగా చిత్రీకరిస్తామని వర్మ తెలిపారు. వర్మ సమర్పణలో ప్రశాంత్ బుర్రా, పి.చంద్రశేఖర్ నిర్మాతలుగా మిలింద్ గడాఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దీనిని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నట్టు వర్మ తెలిపారు.

ప్రస్తుతం 'ఫూంక్-2' షూటింగ్ జరుపుకుంటోందని, తెలుగు వెర్షన్ టైటిల్ ఇంకా నిర్ణయించలేదనీ రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. 'ఫూంక్' చిత్రం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే 'ఫూంక్-2' మొదలవుతుందన్నారు.

ఫూంక్ చిత్రానికి తన అసోసియేట్‌గా చేసిన మిలింద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారనీ, ఈ సీక్వెల్ కు ఆయనే స్క్రిప్టు రచన చేశారని వర్మ తెలిపారు. 2010లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోన్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M