1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "మహాత్మ"ను ట్రైలర్లో తిలకించండి

Mahatma Cinema Trailer, Srikanth, Bhavana, Krishna Vamsi, Gandhi | "మహాత్మ"ను ట్రైలర్లో తిలకించండి

మహాత్మ
హింసా మార్గంలో ఉన్న ఓ యువకుడు అహింసా మార్గంలోకి ఎలా మారాడన్న ఇతివృత్తంతో 'మహాత్మ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న శ్రీకాంత్‌కు ఇది 100వ చిత్రం కావడం ఓ విశేషం.

ఇక 'సింధూరం', 'అంత:పురం', 'ఖడ్గం', 'చక్రం' వంటి సామాజిక స్ఫూర్తి చిత్రాల స్పష్టికర్త కృష్ణవంశీ దీనికి దర్శకుడు కావడంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

జాతిపితగా నీరాజనాలందుకున్న గాంధీజీ స్ఫూర్తిని, కీర్తిని సినిమా అనే కమర్షియల్‌ చట్రంలోకి తీసుకువచ్చి ఔచిత్యభంగం కలుగకుండా ఒక పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌ను రూపొందించడం దర్శకుడికి ఓ పెద్ద ఛాలెంజ్‌. అలాంటి ఛాలెంజ్‌ను స్వీకరించి కృష్ణవంశీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

అలాగే తన 100వ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోవాలని నటుడు శ్రీకాంత్‌ కూడా "మహాత్మ"లో అద్భుతమైన నటనను ప్రదర్శించారని సినీ వర్గాల్లో టాక్. ఇందులో ఒంటరి ఫేమ్ భావన కథానాయికగా నటించింది.

ఇకపోతే... గోల్డెన్‌ లైన్‌ ఫిలిమ్స్‌ పతాకంపై సి.ఆర్‌.మనోహర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి.
About Writer
SELVI.M