1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Eenadu| Cinema| Trailer| Kamal Hassan| Venkatesh| Wednesday| Shruti Hassan | కమల్, వెంకీల "ఈనాడు" సినిమా ట్రైలర్ మీకోసం...

ఈనాడు
వైవిధ్యమైన సినిమాలతో ఏదో కొత్తదనాన్ని తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు చూపించాలని పరితపించే పద్మభూషణ్ కమల్ హాసన్.. తాజాగా సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే కథాంశంతో "ఈనాడు" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని తన అభిరుచికి అనుగుణంగా కమల్‌ సొంతగా నిర్మించడం ఓ విశేషం.

హిందీలో వచ్చిన "వెడ్నెస్‌డే" ఆధారంగా మలిచిన ఈ సినిమాలో వెంకీ పోలీస్ కమిషనర్ పాత్రను పోషిస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వంలో, రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ అధినేత జి. కుమార్ బాబు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ సంగీత దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M