గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "పదహారేళ్ల వయసు" ట్రైలర్ మీ కోసం.. (Padaharella Vayasu Cinema| Trailer| Sridevi| Bhushan| Arya Vohra)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
"పదహారేళ్ల వయసు" సినిమా పేరు చెబితే డ్రీమ్ గాళ్ శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల మదిలో కదలాడుతుంది. ఆ సినిమాలో శ్రీదేవితోపాటు ఆ సినిమా పేరుకు కూడా ఎంతో క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే టైటిల్‌తో ఇద్దరి జీవితాల్లో పదహారేళ్ల ప్రాయం సృష్టించిన అలజడిని ఇతివృత్తంగా తీసుకుని కొత్తగా "పదహారేళ్ల వయసు" రూపుదిద్దుకుంటోంది.

భూషణ్, ఆర్య ఓరా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీసూర్య దర్శకుడు. డెరెక్టర్స్ మూవీ పతాకంపై కిలారి హరిప్రసాద్, యాడవల్లి నర్సింగరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందేశంతో కూడిన యూత్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని నిర్మాతలు తెలిపారు. యువతకు చక్కటి సందేశాన్ని అందిస్తూ.. కమర్షియల్ అంశాలను మేళవించి ఈ సినిమాను రూపొందిస్తున్నామనీ, ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలియజేశారు.

ఈ చిత్రం డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలు ముగించుకుని ప్రస్తుతం డిటిఎస్ జరుపుకొంటోందని చెప్పారు. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.

వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పదహారేళ్ల వయసు, సినిమా, ట్రైలర్, శ్రీదేవి, భూషణ్, ఆర్య ఓరా