1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Kamal Hassan

Eenadu Cinema Trailer| Kamal Hassan| Venkatesh| Shruti Hassan | "ఈనాడు" సినిమా ట్రైలర్‌ను తిలకించండి

ఈనాడు
మనిషిలో రెండు కోణాలుంటాయి. అలా ఓ సగటుజీవి ఉండే రెండో కోణంతో సమాజశ్రేయస్సుకై ఎంతకైనా తెగిస్తాడు? అనే పాయింట్‌తో "ఈనాడు" సినిమా తెరకెక్కింది.

వైవిధ్యమైన సినిమాలతో ఏదో కొత్తదనాన్ని తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు చూపించాలని పరితపించే పద్మభూషణ్ కమల్ హాసన్.. తాజాగా సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే కథాంశంతో "ఈనాడు" చిత్రాన్ని రూపొందించారు.

కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని తన అభిరుచికి అనుగుణంగా కమల్‌ సొంతగా నిర్మించడం ఓ విశేషం.

హిందీలో వచ్చిన "వెడ్నెస్‌డే" ఆధారంగా మలిచిన ఈ సినిమాలో వెంకీ పోలీస్ కమిషనర్ పాత్రను పోషించారు. చక్రి తోలేటి దర్శకత్వంలో, రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ అధినేత జి. కుమార్ బాబు తెలుగు ప్రేక్షకులకు అందించారు.

సమాజాన్ని పట్టిపీడిస్తోన్న బాంబు దాడులకు కారణమైన వారిని ఓ సగటు జీవి ఎలా అంతమొందించాడనే కాన్సెప్ట్‌తో అద్భుతంగా తెరకెక్కిన "ఈనాడు" చిత్రానికి కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ సంగీత దర్శకురాలిగా పరిచయమైంది.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M