1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Gopichand

Sankham Cinema Trailer| Gopichand| Trisha| Varsham| Hero| Heroine | గోపిచంద్, త్రిషల "శంఖం" ట్రైలర్ మీ కోసం..

శంఖం
గోపీచంద్, త్రిష జంటగా శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "శంఖం" చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాను శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా గోపీచంద్ సినీ కెరీర్ గుడ్ మూవీగా నిలిచిపోతుందని నిర్మాత జె. భగవాన్ అన్నారు.

దర్శకుడు శివ మాట్లాడుతూ "ఈ తరం ప్రేక్షకులకు కావలసిన అంశాలన్నింటిని మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. అన్ని కమర్షియల్ హంగులూ ఉన్న ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని ఆయన చెప్పారు.

'వర్షం' చిత్రంలో నాయికా, ప్రతినాయకులుగా నటించి మెప్పించిన త్రిష, గోపీచంద్ "శంఖం" సినిమా ద్వారా నాయికానాయకులుగా ప్రేక్షకుల మన్ననలను చూరగొంటున్నారని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M