1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Ramcharan

Magadheera Cinema Trailer| Ramcharan| Kajala Agarwal| Chiranjeevi| Hollywood | "చిరుత"నయుడి "మగధీర" ట్రైలర్ మీకోసం..

మగధీర
"చిరుత"నయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా, అందాల రాశి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన బ్లాక్ బ్లస్టర్ మూవీ "మగధీర". యాక్షన్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అన్ని అంశాల మేళవింపుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. హాలీవుడ్ స్థాయిలో నిలిచింది.

తమిళ చిత్రాలైన ‘శివాజి’, ‘దశావతారం’, తర్వాత ‘మగధీర’ చిత్రం సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్రను సృష్టింస్తోంది. టాలీవుడ్లో గత రికార్డుల్ని తిరగరాసే విధంగా దూసుకుపోతోన్న ‘మగధీర’ రాష్ట్రంలోనే కాక, ఇతర రాష్ట్రాలలోనూ రికార్డుల్ని బద్ధలు కొడుతోంది.

దక్షిణాంధ్రలో సినిమా విడుదలై రెండు వారాల నుంచి హౌస్ ఫుల్, కలెక్షన్లలో "మగధీర" ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్నాడని ట్రేడ్ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. దీంతో రికార్డు స్థాయిలో "మగధీర" వసూళ్ళను సొంతం చేసుకుంటున్నాడు.

కలకత్తాలోని టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ వారి అంచనాల ప్రకారం బాలివుడ్లో బ్లాక్ బస్టర్ మూవీగా పేరొందిన ‘లవ్ ఆజ్ కల్’ సినిమా కంటే "మగధీర" సినిమా మేనియా లేని హల్ చల్ సృష్టిస్తుందని, కలకత్తా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

ఇకపోతే.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్రమాణాలతో తెరకెక్కిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి.
About Writer
SELVI.M