1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Srimathi Kalyanam| Cinema| Trailer| Vadde Naveen| Sangeetha | "శ్రీమతి కళ్యాణం" ట్రైలర్‌ను తిలకించండి

శ్రీమతి కళ్యాణం
వడ్డే నవీన్, సంగీత జంటగా శివాల్ దర్శకత్వంతో భానుకిరణ్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘శ్రీమతి కళ్యాణం’. ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌తో పాటు వివిధ లొకేషన్లలో చిత్రీకరించారు.

ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను వర్షంలో చిత్రీకరించినట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో సంగీత ద్విపాత్రాభినయం చేసిందని దర్శక నిర్మాతలు వెల్లడించారు.

సూపర్ గ్రోయింగ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై భారుకిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం: చిర్రావూరి బండారు దానయ్య, సివాల్, సంగీతం సాయి కార్తీక్. కుటుంబ విలువలు ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సుధ, చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, దువ్వాసి మోహన్, నారాయణరావు, సూర్య, పి.డి. రాజు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M