1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Prabhas

Ek Niranjan cinema Trailer| Prabhas| Kangana Ranaut| Sonu Sood| Puri Jagannath | "ఏక్ నిరంజన్"‌ను ట్రైలర్లో చూడండి

ఏక్ నిరంజన్
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన భారీ చిత్రం "ఏక్‌నిరంజన్". ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యారామ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యరామ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ 'ఏక్‌నిరంజన్' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిత్రంలో బుజ్జిగాడు, ఛత్రపతి సినిమాల పోలికలున్నట్లు సినీ పండితులు అంటున్నారు.

ఇంకా ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ పాత్రకు న్యాయం చేశాడు. మాస్‌ను బాగా ఆకట్టుకునే స్టైల్‌లో కనిపించాడు. కానీ డైలాగ్ మాడ్యులేషన్ రొటీన్‌కు భిన్నంగా చేశాడు.

సినిమా మొత్తంగా సోనూసూద్, అతని అసిస్టెంట్ బ్రహ్మాజీ, ఆ తర్వాత ప్రభాస్‌పై జరిగే సన్నివేశాలు, సంభాషణలే ఎంటర్‌టైన్ చేస్తాయి. విలన్‌ను కొత్తగా చూపించే క్రమంలో పూరీ జగన్నాథ్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ విలనే అయినా విలన్ మేనరిజం, ప్రవర్తన ఆకట్టుకుంటాయి. భరణి, సంగీత పాత్రలు రొటీన్‌గా ఉన్నాయి.

మొత్తానికి " ఏక్ నిరంజన్" మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షిద్దామా..?
About Writer
SELVI.M