1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Prabhas

Ek Niranjan cinema Trailer| Prabhas| Kangana Ranaut| Sonu Sood| Puri Jagannath | ప్రభాస్, కంగనల "ఏక్‌ నిరంజన్" ట్రైలర్ మీకోసం

ఏక్ నిరంజన్
రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ జంటగా.. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం "ఏక్‌నిరంజన్".

ఆదిత్యరామ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ ఆదిత్యరామ్‌ ఆదిత్యమూవీస్‌ పతాకంపై నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. సోనూసూద్‌, ముకుల్‌దేవ్‌, మకరన్‌, దేశ్‌పాండే, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, పోసాని, సత్యప్రకాష్‌, అలీ, సునీల్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి క్లైమాక్స్ సన్నివేశం హైలైట్‌గా నిలిచిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్.

ఇంకా ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ పాత్రకు న్యాయం చేశాడు. మాస్‌ను బాగా ఆకట్టుకునే స్టైల్‌లో కనిపించాడు. కానీ డైలాగ్ మాడ్యులేషన్ రొటీన్‌కు భిన్నంగా చేశాడు.

సినిమా మొత్తంగా సోనూసూద్, అతని అసిస్టెంట్ బ్రహ్మాజీ, ఆ తర్వాత ప్రభాస్‌పై జరిగే సన్నివేశాలు, సంభాషణలే ఎంటర్‌టైన్ చేస్తాయి. విలన్‌ను కొత్తగా చూపించే క్రమంలో పూరీ జగన్నాథ్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ విలనే అయినా విలన్ మేనరిజం, ప్రవర్తన ఆకట్టుకుంటాయి. భరణి, సంగీత పాత్రలు రొటీన్‌గా ఉన్నాయి.

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: శ్యామ్‌కె నాయుడు, సమర్పణ: పూరీ జగన్నాథ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరీజగన్నాథ్‌. మరి ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షిద్దామా..?
About Writer
SELVI.M