1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Edukondalavada venkataramana| Cinema| Trailer| Surendra| Sunil | ''ఏడుకొండలవాడా వెంకటరమణ'' సినిమా ట్రైలర్

ఏడుకొండలవాడా వెంకటరమణ
సురేంద్ర, సునీల్‌, శివారెడ్డి ప్రధాన పాత్రలో శ్రీ కాశీనాయన కళామందిర్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ఏడు కొండలవాడా వెంకటరణ (అందరూ బాగుండాలి). సూర్య ఇంజమూరి దర్శకత్వంలో గుండ్లకుంట్ల శ్రీరాములు నిర్మించిన ఈ సినిమా 'ప్రస్తుతం డి.టి.యస్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

నవంబర్‌‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ 'సమకాలీన సమస్యను చర్చిస్తూ వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు. నటీ నటులందరూ చక్కని అభినయాన్ని కనబర్చారు. రసిక (నూతన పరిచయం), నవనీత్‌కౌర్‌ హీరోయిన్లుగా నటించారు.

గ్లామర్‌తో కూడిన వారి అభినయం అందరినీ ఆకట్టుకుంటుందని దర్శకుడు వెల్లడించారు. పిల్లా ప్రసాద్‌, సుమన్‌శెట్టి, గోరటి వెంకన్న తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్‌ అతిధి పాత్రలో నటిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఆడియోకు శ్రోతల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రానికి సంగీతం ఘంటాడి కృష్ణ, నిర్మాత: గుండ్లకుంట శ్రీరాములు, దర్శకత్వం: సూర్య ఇంజమూరి.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M