1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Allari Naresh

Bendu Apparao Cinema Trailer| Allari Naresh| Kamna Jetmalani| Meghana | ''బెండుఅప్పారావు''ను ట్రైలర్లో చూడండి

బెండుఅప్పారావు
అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు వంటి ఎన్నో నవ్వొచ్చే కామెడీ చిత్రాలు తీసిన ఇ.వి.వి. తాజాగా అల్లరి నరేష్‌తో "బెండు అప్పారావు" చిత్రాన్ని తెరకెక్కించారు.

కామ్నా జఠ్మలాని కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బొబ్బర్లంక అనే పల్లెలో బెండుఅప్పారావు (అల్లరి నరేష్) అనే ఆర్.ఎంపి డాక్టర్ తనకు తెలిసిన వైద్యం చేస్తూ అడ్డదిడ్డంగా సంపాదిస్తూ వెలిగిపోతూంటాడు. తన అడ్డదిడ్డమైన సంపాదనకు కారణమేమిటి? కామ్నాను ఎలా ప్రేమిస్తాడు? అప్పారావు వైద్యం సక్రమంగా ఫలించిందా? వంటి పలు అంశాలతో తెరకెక్కిన "బెండుఅప్పారావు" ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తున్నాడు.

అప్పుడప్పుడూ నవ్వొచ్చే డైలాగులు, సిట్యువేషన్స్, సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే పూర్తి స్ధాయి ఎంటర్‌టైనర్ అనుకుని వెళ్లే ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది.

ఇకపోతే.. సురేష్‌ ప్రొడక్షన్స్‌‌పై తెరకెక్కిన ఈ సినిమాలో నరేష్‌, కామ్న జెఠ్మలానీ, మేఘన, ఆహుతి ప్రసాద్‌, కృష్ణభగవాన్‌, చలపతిరావు, రఘుబాబు, ధర్మవరపు తదితరులు నటించారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం :కోటి, నిర్మాత: డా||డి.రామానాయుడు, దర్శకత్వం: ఇ.వి.వి.సత్యనారాయణ.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన "బెండుఅప్పారావు" సినిమా ట్రైలర్‌ను తిలకించండి.
About Writer
SELVI.M