1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Sairam Shankar

Bumper Offer Cinema Trailer| Sairam Shankar| Bindu Madhavi| Avakai Biryani| Puri jagannath | "బంపర్ ఆఫర్" ట్రైలర్ మీ కోసం..

బంపర్ ఆఫర్
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా, 'ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్ బిందు మాధవి హీరోయిన్‌గా నటించిన చిత్రం "బంపర్ ఆఫర్". ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్‌తో తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పూరి జగన్నాథ్ చెప్పారు.

తెలుగులో విడుదలైన "బంపర్ ఆఫర్" సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయని, ఏలూరు ప్రాంతంలో పక్కన ఉన్న థియేటర్లలో కూడా వేరే సినిమా ఆపి ఈ చిత్రాన్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని చిత్ర నిర్మాత పూరీ జగన్నాథ్ వెల్లడించారు.

రఘుకుంచె ఈ చిత్రానికి మ్యూజిక్ అందించి మంచి మార్కు సంపాదించాడని పూరీ తెలిపారు. 143 సినిమా తర్వాత సాయిరాం నటునిగా ఎదుగుతూ ఈ చిత్రంలో కొత్త గెటప్‌లో కన్పించి క్రేజీ హీరోగా అలరించాడని కితాబిచ్చారు.

"మగధీర" చూసి అలీపై పారడీ చేయాలనిపించి రాజమౌళిని అడిగితే.. నీకు ఇష్టం వచ్చినట్లు మార్చుకోండని అన్నారని పూరి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో చూసి ఆనందించండి.
About Writer
SELVI.M