1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Rana

Leader Cinema Trailer| Rana| Sekhar Kammula| Happy Days| Priya Anand| Richa gangopadhyay | శేఖర్ కమ్ముల, రాణాల "లీడర్" ట్రైలర్‌ను వీక్షించండి

లీడర్
కళాశాల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు ‘హ్యాపిడేస్’గా మలచిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో ‘లీడర్’ చిత్రం ద్వారా తెరపై చూపెట్టనున్నారు.

డి. రామానాయుడు మనుమడు సురేష్ బాబు కుమారుడు రాణా హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక ఎ.వి.ఎం. సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇకపోతే.. ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఆధారంగా ‘లీడర్’ కథను మలచినట్లు ఫిలిమ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా పూర్తయిన తర్వాత అందులోని సన్నివేశాల్లో వాస్తవికత ఉండటంతో 'లీడర్' సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశంవుందని సినీ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

ఇంకా ఈ చిత్రంలో కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, సుహాసిని మణిరత్నం, రావురమేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.